కథానాయకుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'స్టూడెంట్'. విజేత పరీక్ కథానాయిక. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్లపై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తుండగా, బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి సహ నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. విద్యార్థి రాజకీయాల్లోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే అంశాన్ని టీజర్‌లో చూపించారు. భాను ప్రేమకథతో పాటు రాజకీయ ప్రయాణం, భుజంగం–కేతిరెడ్డి మధ్య విభేదాలను ఇందులో ప్రస్తావించారు. యువ రాజకీయ నాయకుడి పాత్రలో మేఘాంశ్ శ్రీహరి ఆకట్టుకున్నారని మేకర్స్ తెలిపారు. శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
Print Edition'స్టూడెంట్' టీజర్ విడుదల
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 09:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)