mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..

11 గంటల క్రితం

dharna.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎయు ప్రధాన గేటు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నిరసన

ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : దేశవ్యాప్తంగా ప్రవేశ, నియామక పరీక్షల్లో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కాన్వొకేషన్‌లో పాల్గొనేందుకు మంగళవారం విశాఖకు కేంద్ర మంత్రి రానున్న నేపథ్యంలో సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘గో బ్యాక్ ధర్మేంద్ర ప్రధాన్‌’ నినాదాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీలు కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను రద్దు చేయాలని, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనల నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి చొప్పున నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో విశాఖపట్నం రానున్న కేంద్ర విద్యాశాఖ మంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యను బలహీనపరిచే విధానాలను అమలు చేస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి జి అజయ్, ఎయు కార్యదర్శి ఎం కుసుమాంజలి, ఉపాధ్యక్షులు తరుణ్, నాయకులు ప్రగతి, నరేష్, సంజయ్, నిఖిల్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్