ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపి ఇఎపి సెట్-2026) ఫలితాలను గురువారం నాడు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎపి ఇఎపిసెట్-2026 నిర్వహణ బాధ్యతలను జెఎన్‌టియు కాకినాడకు అప్పగించినట్లు తెలిపింది. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను మే 12 నుంచి 15 వరకు, అలాగే మే 18న నిర్వహించగా, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను మే 19, 20 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించారు. రాష్ట్రంలోని 48 పట్టణాల్లో ఏర్పాటుచేసిన 140 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో రెండు కేంద్రాల్లో పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.
రేపు ఇఎపిసెట్ ఫలితాలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 06:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)