mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కుక్కల దాడిలో 13 పొట్టేలు మృతి

2 గంటల క్రితం

dog
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 07:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రొద్దం: కుక్కల దాటిన 13 పొట్టేలు మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని డి రంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. రంగాపురానికి చెందిన వడ్డె శ్రీనివాసులు బేల్దారి పని చేసుకుంటూ జీవనం చేసేవారు. అయితే కూలి సంపాదనతో వచ్చిన డబ్బుతో 15 పొట్టెలను గ్రామ సమీపంలోనే పంట పొలాల్లో ఉంచుకొని మేపేవారు. అయితే బుధవారం రాత్రి అమందలోకి కుక్కలు చేరి దాడి చేయడంతో తొమ్మిది పొట్టేలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఉదయం గొర్రెల మంద వద్దకు వెళ్లిన ఆయన చూడగా మృతి చెందిన గొర్రెలను చూసి బోరును వినిపించారు. దీంతో దాదాపు లక్ష రూపాయలు ఆర్థిక నష్టం జరిగినట్లు తెలిపారు. కావున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్