mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జమ్మలమడుగులో ఉద్రిక్తత - వైసిపి నేతల అడ్డగింత

1 గంట క్రితం

ycp protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

జమ్మలమడుగు (వైఎస్ఆర్ కడప) : జమ్మలమడుగులో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైసిపి నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్‌ స్టీల్స్‌ పరిశీలనకు వైసిపి నేతలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల వైఖరికి నిరసనగా వైసిపి నేతలు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక, స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వారిలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్