శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ముంబయిలో గడిచిన 24 గంటల్లో 100 మి.మీ.కుపైగా వర్షపాతం

2 గంటల క్రితం

rains in 24 hrs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 11:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 గంటల వరకు) నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మి.మీ.కుపైగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. శుక్రవారం కూడా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది. గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని బృహన్‌ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తన తాజా నివేదికలో వెల్లడించింది.


గురువారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దాదర్, అంధేరి, గొరెగావ్, పరేల్ తదితర లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తెల్లవారుజామున వర్షం తీవ్రత కొంత తగ్గినప్పటికీ, ఉదయం 8 గంటల తర్వాత మళ్లీ భారీ వర్షం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. బిఎంసీ గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో ఐలాండ్ సిటీలో సగటున 126 మి.మీ., తూర్పు శివారు ప్రాంతాల్లో 110 మి.మీ., పశ్చిమ శివారు ప్రాంతాల్లో 114 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వాడి బందర్‌లో 150.2 మి.మీ., మలబార్ హిల్‌లో 145.8 మి.మీ., సాండ్‌హర్స్ట్ రోడ్‌లో 140.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం పశ్చిమ శివారులోని చాందివాలి ప్రాంతంలో ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి మృతిచెందాడు. ఈ వారంలో వర్షాలతో ఇద్దరు మరణించారు. మంగళవారం చెంబూర్‌లో పాఠశాల బస్సుపై చెట్టు కూలిపోవడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్