ప్రజాశక్తి - ఏలూరు: ఈ నెల 3,4,5వ తేదీలలో జరగనున్న ఏపీ రైతుసంఘం రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఉన్న డి సి ఎం ఎస్ భవనంలో మూడురోజుల సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 800 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనున్నారు. తొలిరోజు శుక్రవారం భారీ ప్రదర్శన, ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుంది. మిగిలిన రెండు రోజులు ప్రతి నిధులు చర్చలు జరగనున్నాయి. జాతీయ, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రదర్శనలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు.
రైతుసంఘం రాష్ట్ర మహాసభలకు ఏలూరు సిద్ధం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 12:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)