- ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని సిపిఎం ధర్నా
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : విబి గ్రామ్ జి పథకాన్ని రద్దుచేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ గురువారం తిలక్ రోడ్ లోని పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు జి బాలసుబ్రమణ్యం, సిపిఎం జిల్లా నాయకులు టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేదల పొట్ట కొట్టే విబి గ్రామజీ బతకని రద్దుచేసి 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దించాలని రాష్ట్రాలపై భారాలు పెరిగే విధంగా ఉందని దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. గత ఉపాధి హామీ చట్టంలో కేంద్రం 9% నిధులు కేటాయిస్తే రాష్ట్రం ప్రభుత్వం 10% నిధులు ఖర్చు చేసేవని కానీ పథకం కేంద్రం 60% రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించేలా మార్పులు చేశారన్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు ఈ నిధులు కేటాయించలేము అని చెబుతున్నారు. అంటే ఈ పథకం ఎత్తివేసే దురుద్దేశంతోనే మార్పులు తీసుకొచ్చారని విమర్శించారు దీనివల్ల తిరిగి వ్యవసాయ కార్మికులు పేదలు భూస్వాములపై ఆధారపడి పరిస్థితి వస్తుందని తిరిగి వలసలు ప్రారంభమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడుదారుల సేవలు తరిస్తూ సంపద సృష్టిస్తున్న శ్రమజీవుల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తుందని విమర్శించారు 90% నిధులు కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు రోజు వేతనం 600 రూపాయలు చెల్లించాలని కోరారు. పని ప్రదేశాల్లో రెండుసార్లు ఫేస్ మాస్టర్ రద్దుచేసి మ్యానువల్ హాజరు వేయాలని డిమాండ్ చేశారు వడదెబ్బకు ప్రమాదాలకు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్పీరియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర, ఆర్ లక్ష్మి, పి సాయి లక్ష్మి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)