- ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్ : బంగ్లాదేశ్‌లోని ఐదు కీలక ప్రభుత్వ సంస్థలను ఆధునీకరణ కోసం ప్రపంచ బ్యాంకు (డబ్ల్యుబి) దాదాపు 2.36 వేల కోట్ల (250 మిలియన్ డాలర్లు) రుణ సాయాన్ని అందించనుంది. ప్రభుత్వ రంగ కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపినట్లు ప్రపంచ బ్యాంకు బంగ్లాదేశ్, భూటాన్ విభాగాల డైరెక్టర్ జీన్ పెస్మే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై బంగ్లాదేశ్ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ సంస్థల ఆధునీకరణ, పారదర్శకత, జవాబుదారీతనం కోసం సంస్థలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఎస్‌ఐటిఎ ప్రాజెక్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగమని బంగ్లాదేశ్ ఆర్థిక, ప్రణాళికా శాఖ సహాయ మంత్రి జోనాయెద్ సాకి తెలిపారు.









కామెంట్‌లు (0)