కరాచీ : పాకిస్తా న్-అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాక్ భద్రతా దళాలు ఆదివారం భారీ సైనిక చర్య చేపట్టాయి. భూ ఆపరేషన్‌తో పాటు ఉగ్రవాదుల స్థావరాలు, సురక్షిత కేంద్రాలపై లక్ష్యిత దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 36 మంది ప్రాణాలు కోల్పోగా, 163 మంది గాయపడినట్లు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. మూడు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొంది. పాకిస్థాన్లో ఇటీవల జరిగిన వరుస ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. తాజా చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్థాన్‌లో పోలీసు, భద్రతా దళాలపై ఉగ్రదాడులు గణనీయంగా పెరిగాయి. ఈ దాడుల వెనుక తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ), దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని పాకిస్తా న్ ఆరోపిస్తోంది. తాజా ఆపరేషన్‌కు ఒక రోజు ముందు కరాచీలోని పారా మిలటరీ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాల యంపై తుపాకులు, పేలుడు పదార్థాలతో దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు.
Print Editionఆఫ్ఘన్ సరిహద్దులో పాక్ దాడులు.. 36 మంది మృతి
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)