mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐదురోజుల అనంతరం శిథిలాల నుండి సజీవంగా బాలుడు

2 గంటల క్రితం

Boy Found Alive
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కారకాస్‌ : వెనిజులాలో శిథిలాల నుండి సోమవారం రాత్రి 12 ఏళ్ల బాలుడు కార్లోస్‌ మిగెల్‌ కొల్మెనారోస్‌ అనే 12ఏళ్ల బాలుడిని సహాయక బృందాలు రక్ష‍ించాయి. జూన్‌ 24న వరుస భూకంపాల ధాటికి వెనిజులా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఐదు రోజుల తర్వాత లాగ్వైరా రాష్ట్రంలోని మకుటోలో ఒక నివాస భవనం శిథిలాల నుండి 12ఏళ్ల బాలుడిని సజీవంగా రక్ష‍ించారు. క్విటో అగ్నిమాపక దళానికి చెందిన యుఎస్‌ఎఆర్‌ ఇసియు-01 బృందం, డొమినిక్‌ రిపబ్లిక్‌కు చెందిన రెస్క్యూ నిపుణులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో, వర్గాస్‌ మునిసిపాలిటీలోని మకుటో పారిష్‌లో కార్లోస్‌ మిగెల్‌ కొల్మెనారోస్‌ను గుర్తించారు. కూలిపోయిన భవన శిథిలాల నుండి గంటల తరబడి శ్రమించి, బాలుడిని జాగ్రత్తగా బయటకు తీశారు. రెస్క్యూ అనంతరం కార్లోస్‌ను స్ట్రెచర్‌పై ప్రత్యేక వైద్య చికిత్స కోసం అంబులెన్స్‌లో తరలించారు. బాలుడిని రక్ష‍ించడంతో ఈ ఆపరేషన్‌లో ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలిస్తున్న బృందాల సంకల్పాన్ని మరింత బలపరిచిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.




వెనిజులాలో 1,719మంది మృతి

వరుస భూకంపాలతో వెనిజులాలో 1,719మంది మరణించగా, 5,034మంది గాయపడినట్లు బొలీవియా ప్రభుత్వం అధికారిక నివేదికలో తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో జాతీయ, అంతర్జాతీయ సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని తెలిపింది. లాటిన్‌ అమెరికా, ఐరోపా, ఆసియా ప్రభుత్వాలు వెనిజులాకు మానవతాసాయన్ని అందిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్