mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionEngland vs New Zealand: టెస్ట్ సిరీస్ న్యూజిలాండ్‌ కైవసం

1 రోజు క్రితం

newzeland
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 11:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మూడో టెస్ట్‌‌లో ఇంగ్లండ్‌‌పై 160 పరుగుల తేడాతో గెలుపు

నాటింగ్‌‌హామ్‌: మూడో, చివరి టెస్ట్‌‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ ‌జట్టు 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌‌ను ఓడించింది. ఓవర్‌ ‌నైట్‌ ‌స్కోర్‌ 4‌ వికెట్ల నష్టానికి 103 పరుగులతో సోమవారం నాల్గోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ ‌జట్టు 212 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ ‌కీపర్‌ ‌స్మిత్‌(60)‌కి తోడు కెప్టెన్‌ ‌బెన్‌ ‌స్టోక్స్‌(30), డకెట్‌(36) ‌మాత్రమే బ్యాటింగ్‌‌లో రాణించారు. దీంతో 373 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌‌లో 212 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్‌ ‌బౌలర్లు ఫోల్కెస్‌‌కు మూడు, నాథన్‌ ‌స్మిత్‌, సాంట్నర్‌‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ ‌డారీ మిఛెల్‌‌కు లభించగా.. సిరీస్‌ ‌జోఫ్రా ఆర్చర్‌, నాథన్‌ ‌స్మిత్‌‌కు దక్కాయి. దీంతో మూడు టెస్ట్‌ ‌మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను న్యూజిలాండ్‌ 2-1తో చేజిక్కించుకుంది. ఈ టెస్ట్‌ ఓటమితో ఇంగ్లండ్‌ ‌కెప్టెన్‌ ‌బెన్‌ ‌స్టోక్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ‌కెరీర్‌ ‌ముగిసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్