mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ షాక్..

1 గంట క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేయలేమంటూ తీర్పు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలకు యూఎస్ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా మట్టిపై జన్మించిన ఎవరికైనా సహజంగానే వచ్చే 'బర్త్ రైట్ సిటిజన్‌షిప్' (పుట్టుకతో వచ్చే పౌరసత్వం) హక్కును సుప్రీంకోర్టు సమర్థించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారు. దేశంలోకి అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై వచ్చే వారి పిల్లలకు పౌరసత్వం దక్కకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతో ఆయన గతంలో ఒక వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (అత్యవసర ఉత్తర్వు) కూడా జారీ చేశారు. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించిన సుప్రీంకోర్టు.. అధ్యక్షుడి ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ కొట్టివేసింది. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వ హక్కులు యధావిధిగా కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో తేల్చిచెప్పింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్