mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈజిప్ట్‌, ఇరాన్ మ్యాచ్ డ్రా

3 రోజుల క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 10:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఫిఫా ప్రపంచకప్‌‌ గ్రూప్‌-జి నిరాశపరుస్తున్న ఈజిప్ట్‌ ‌జట్టు 2వ స్థానంతో ముగించి నాకౌట్‌‌కు చేరింది. శనివారం జరిగిన గ్రూప్‌ లీగ్‌ ‌చివరి మ్యాచ్‌‌లో ఈజిప్టు, ఇరాన్‌‌ జట్లు 1-1తో డ్రాతో ముగించాయి. ఇరుజట్లు నాకౌట్ బెర్తు లక్ష్యంగా హోరాహోరీగా తలపడ్డాయి. ఐదో నిమిషంలోనే మహమూద్ సబెర్ గోల్ అందించగా.. ఈజిప్ట్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇరాన్‌కు పెనాల్టీ లభించినా సద్వినియోగం చేసుకోలేదు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ 14వ నిమిషంలో రమిన్ రజీయన్ గోల్‌తో ఇరాన్ 1-1తో స్కోర్ సమం చేసింది. ఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. 93వ నిమిషంలో ఆట ముగుస్తుందనగా.. ఇరాన్ ప్లేయర్ ఖలిజదేహ్ ఈజిప్ట్ గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపాడు. 2-1తో ఆసియా జట్టు గెలిచిందనుకుంటే.. బంతి ఆఫ్‌ సైడ్ వెళ్లిందని వీడియో అసిస్టెంట్ రిఫరీ గోల్ ఇవ్వలేదు. దాంతో 1-1తో మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఈజిప్ట్ నాకౌట్‌లో అడుగుపెట్టింది. ఈ గ్రూప్‌ నుంచి బెల్జియం(5‌పాయింట్లు) ‌32వ రౌండ్‌కు చేరింది. ఇక ఇరాన్‌ ‌గ్రూప్‌ ‌దశలో ఆడిన స్పెయిన్‌, ఉరుగ్వే, ఈజిప్ట్‌ ‌మూడు మ్యాచ్‌‌లను డ్రాగా ముగించి 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

అంతకుముందు ఇదే గ్రూప్‌‌లో జరిగిన చివరి లీగ్‌ ‌మ్యాచ్‌‌లో బెల్జియం జట్టు 5-1గోల్స్‌ ‌తేడాతో న్యూజిలాండ్‌‌ను ఓడించింది. బెల్జియం తరఫున లియాండ్రో టోస్టార్ట్‌ 28వ ని., 50వ ని.లో రెండు గోల్స్‌ ‌చేయగా. కెవిన్‌66‌వ ని. రొమేలు 86వ ని.లో, అలెక్సిన్‌ అదనపు సమయం 94వ ని.లో ఒక గోల్‌ ‌కొట్టాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్