రౌండ్ - 32కు అర్జెంటీనా, ఫ్రాన్స్, నార్వే
ఫిలడెల్ఫియా: 2022 ఖతార్ ఫిఫా ప్రపంచకప్ లో గోల్డెన్ బూట్ గెలిచిన ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబపే 2026లోనూ ఇరగదీస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో సెనెగల్‌పై 2గోల్స్‌తో మెరిసిన ఎంబపే.. రెండో లీగ్ మ్యాచ్‌లో ఇరాక్‌పై మరో రెండు గోల్స్ కొట్టాడు. గ్రూప్-ఐ లో ఫిలడెల్ఫియా స్టేడియంలో ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు 3-0తో విజయం సాధించింది. జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు 3-0 గోల్స్ తేడాతో ఇరాక్‌పై విజయం సాధించింది. దీంతో ఫ్రాన్స్ జట్టు ఈ గ్రూప్‌లో 6 పాయింట్లతో రౌండ్-32లోకి ప్రవేశించింది. ఫ్రాన్స్, ఇరాక్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం అయ్యింది. రెండు గంటల బ్రేక్ తర్వాత రెండో అర్ధభాగం ప్రారంభమైంది. మ్యాచ్ టైంకే స్టార్ట్ అయినా వర్షం వల్ల మైదానం మొత్తం చిత్తడిగా మారింది. కానీ ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబాప్పే మాత్రం తన ట్యాలెంట్ ప్రదర్శించాడు. పూర్తి ఆధిపత్యంతో ఫ్రాన్స్ ఆడింది. ఆట 14వ నిమిషంలో ఎంబాప్పే తొలి గోల్ చేశాడు. ఎడమ కాలితో పెనాల్టీ ఏరియా చివరి నుంచి గోల్ కొట్టాడు. మళ్లీ 54వ నిమిషంలో ఎంబపే తన రెండో గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో ఫ్రాన్స్ ప్లేయర్ డెంబ్లి 66వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో ఇరాక్ వరుసగా రెండో ఓటమితో లీగ్ దశలో నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో ఇరాక్ 1-4తో నార్వే చేతిలో ఓడింది. 27న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో నార్వేతో ఫ్రాన్స్, సెనెగల్‌తో ఇరాక్ జట్లు తలపడనున్నాయి.
నార్వే ఖాతాలో మరో గెలుపు: ఎర్లింగ్ హాలాండ్ రెండు గోల్స్..
న్యూయార్క్ వేదికగా జరిగిన గ్రూప్-ఐ మ్యాచ్‌లో నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలాండ్ అద్భుతం సృష్టించాడు. సెనెగల్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నార్వే 3-2 గోల్స్ తో గెలిచింది. నార్వే తరపున హాలాండ్ రెండో గోల్స్ చేశాడు. దీంతో ఆ జట్టు నాకౌట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హాలాండ్.. ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు గోల్స్ కొట్టాడు. 43వ నిమిషంలో పీడరసన్ తొలి గోల్ చేయగా.. 48వ నిమిషంలో, 58వ నిమిషంలో హాలాండ్ రెండు గోల్స్ చేశాడు. తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న హాలాండ్.. రెండు మ్యాచుల్లోనే నాలుగు గోల్స్ చేశాడు. దీంతో గ్రూప్-ఐ నుంచి ఫ్రాన్స్, నార్వే రౌండ్-32కు చేరాయి.
5గోల్స్‌తో టాప్ లో మెస్సీ
గోల్డెన్ బూట్ రేసులో ముగ్గురు
2026 ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్స్ మోత మోగుతోంది. గ్రూప్ స్టేజ్‌లోనే గోల్డెన్ బూట్ రేసు రసవత్తరంగా మారింది. రెండు మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా స్టార్ మెస్సీ.. 5 గోల్స్‌తో ప్రథమ స్థానంలో ఉండగా.. ఫ్రాన్స్ కెప్టెన్ కైలియన్ ఎంబపే, నార్వే ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ నాలుగేసి గోల్స్‌తో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. మెస్సీ ఆస్ట్రియాపై రెండు గోల్స్ చేసి ప్రపంచ కప్ పోటీల్లో 18 గోల్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఫిఫా ప్రపంచకప్ లో నేడు...
24(బుధ) : కొలంబియా × డిఆర్ కాంగో (ఉ.7.30గం.లకు)
25(గురు): స్విట్జర్లాండ్ × కెనడా, బోస్నియా × ఖతార్ (తె.12.30గం.లకు)
మొరాకో × హైతీ, స్కాట్లాండ్ × బ్రెజిల్ (తె.3.30గం.లకు)
దక్షిణాఫ్రికా × ద. కొరియా, చెక్ రిపబ్లిక్ × మెక్సికో (తె.6.30గం.లకు)









కామెంట్‌లు (0)