బిసిసిఐ : జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా గేమ్స్-2026 కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బిసిసిఐ మహిళల సెలక్షన్ కమిటీ ప్రకటించింది. గత ఆసియా గేమ్స్‌లో హాంగ్జౌలో స్వర్ణ పతకం గెలిచిన టీమిండియా.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా మరోసారి బంగారు పతకాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుండగా, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, వికెట్ కీపర్ రిచా ఘోష్‌లతో పాటు పలువురు యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశం లభించింది. వికెట్ కీపర్‌గా జి. కమలిని కూడా ఎంపికైంది. ఇక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఎంపిక మాత్రం ఆమె ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాతే తుది జట్టులో కొనసాగనుంది.
భారత మహిళల జట్టు ....
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ (ఫిట్‌నెస్‌కు లోబడి), రాధా యాదవ్, నందిని శర్మ.









కామెంట్‌లు (0)