ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కారు ప్రమాదం - జబర్దస్త్ కమెడియన్లకు గాయాలు

12 నిమిషాల క్రితం

Car accident Jabardasth comedians sustain injuries
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 04:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

భీమవరం (పశ్చిమ గోదావరి) : ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం గోరగనమూడి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడలో జనసేన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. గోరగనమూడి వద్దకు రాగానే దొరబాబు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు కాగా, కారు నడుపుతున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి హుటాహుటిన భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమా లేక నిద్రమత్తు కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమ అభిమాన కమెడియన్లకు ప్రమాదం జరిగిందని తెలియడంతో జబర్దస్త్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్