ప్రజాశక్తి-కొండాపురం (కడప) : పట్టణంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న, తమ్ముడు మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. కొండాపురం పట్టణం యస్.సి కాలనీకి చెందిన పెద్దుగాళ్ళ బాబు (57) పెద్దుగాళ్ళు ప్రతాప్ (54) అలియాస్ రొడ్డ ప్రతాప్ ఇద్దరూ ఇంటి వద్ద నుండి పట్టణంలోని కి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి లారీ వెనుక వస్తున్న బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ ఇద్దరూ ముద్దనూరు ప్రభుత్వ హాస్టల్ లో వంట మాస్టర్ గా పని చేస్తున్నారు. అన్న, తమ్ములు ఒకేసారి ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొన్నది. కొండాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో అన్న తమ్ముడు మృతి
20 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 22, 2026, 04:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)