mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition'వెలిగొండ` నిర్వాసితులకు అండగా ఉంటాం

2 గంటల క్రితం

CM Chandrababu handed over a cheque for Rs 300 crore in R&R funds to farmers and displaced persons of the Veligonda region.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 12:48 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ముఖ్యమంత్రి చంద్రబాబు

• ప్యాకేజీ కోసం రూ. 300 కోట్లు చెక్కు అందజేత

ప్రజాశక్తి- పెద్దదోర్నాల (మార్కాపురం జిల్లా) : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు గ్రామాల ప్రజలు త్యాగం చేశారని, వారి త్యాగాలను మరువలేమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. నిర్వాసితులకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపానగల ఫీడర్ కెనాల్ వద్ద నిర్వాసిత రైతులతో శనివారం ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతం ఇప్పటికీ కరువు కాటకాలతో అల్లాడుతోందన్నారు. సాగునీరు కాదు కదా... రక్షిత తాగునీరు కూడా ఈ ప్రాంత ప్రజలకు కరువైందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాల ప్రజలు, రైతులు త్యాగం చేయడంతో వెలిగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి కానుందని, 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికిపైగా తాగునీరు అందనుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.10,580 కోట్లు వ్యయం అవుతుందని, ఇప్పటివరకు రూ. 6,736 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇంకా రూ.3,840 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఇటీవలే రూ.750 కోట్లు వెచ్చించామని, తాజాగా నిర్వాసితుల కోసం రూ.905.56 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ముందుగా రూ.300 కోట్లు ప్యాకేజీ నిమిత్తం పంపిణీ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కదలిక వచ్చిందని, ఈ ఏడాదిలోనే పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. 2027లో వెలుగొండ ప్రాజెక్టు నల్లమల జలాశయంలోకి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రింబవళ్లు ఇక్కడే ఉంటున్నారన్నారు. అత్యంత ప్రమాదకరమైన స్వరంగమార్గంలోనూ పనుల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా అందరికీ ప్రయోజనం కలిగే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని, నిర్వాసితులను ఆదుకోవడమే కాకుండా, పునరావాస కాలనీలలో వసతులన్నీ కల్పించామని పేర్కొన్నారు. తాజాగా పంపిణీ చేసిన ప్యాకేజీ డబ్బులు సోమవారం నాటికి నిర్వాసితుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. సుంకేసుల నుండి కాసిం వలి, అనుముల ప్రసాదు, వట్టిపడే నుండి ఒంటెద్దు వెంకట శివ రంగారెడ్డి, గుణంచర్ల నుండి నంది రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు తమ సమస్యలను చంద్రబాబుకు విన్నవించారు. చాలాకాలం తర్వాత తమకు ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటునందుకు కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో టిడిపి కార్యకర్త హఠాన్మరణం!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిద్దలూరు పర్యటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండల పరిధి క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన సిఎం బహిరంగ సభలో బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త శ్రీరామ్ రవి(45) గుండెపోటుతో మృతి చెందారు. ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా సభా ప్రాంగణంలో కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన తోటి కార్యకర్తలు, నాయకులు వెంటనే ఆయనను గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్