- ఉండవల్లిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కెవిఎన్ చక్రధర్ బాబు వెల్లడించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైజాగ్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5 ఏళ్లలోపు ఉన్న 49.20 లక్షల మందికి పోలియో చుక్కల్ని వేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక బూత్‌లలో పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన డోస్‌లను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని తెలిపారు.పల్స్ పోలియో కార్యక్రమాల నిర్వహణ కోసం రూ.6.20 కోట్ల వరకు ఖర్చు చేస్తునట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో(ఎఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, స్టాఫ్ నర్సుల బృందం) పిల్లలకు ఆదివారం పోలియో చుక్కల్ని వేస్తారని పేర్కొన్నారు. ఆరోజు పలు కారణాలవల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు వారి ఇళ్లకు మరసటి రెండు రోజులు ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి చుక్కలు వేస్తాయని తెలిపారు.








కామెంట్‌లు (0)