సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్జున అవార్డు పొందిన తెలుగు తేజాలకు సిపిఎం అభినందనలు

19 ఆగస్టు, 2026

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 11:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : 2025 క్రీడలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డులకు ఎంపికైన పుల్లెల గాయత్రి (బ్యాడ్మింటన్‌), ధనుష్ శ్రీకాంత్ (పారా షూటింగ్)కు సిపిఎం రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధనుష్ శ్రీకాంత్ వినికిడి సమస్య ఉన్నా.. దానిని లోపంగా భావించకుండా మూడు స్వర్ణ పథకాలు సాధించి క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పుల్లెల గాయత్రి-ట్రీషా జాలే జోడీగా అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలకు గానూ ఈ అవార్డులకు ఎంపికవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు నిధులు కేటాయించి గ్రామ స్థాయి నుంచి క్రీడా కారులను ప్రోత్సహిస్తే మరెంతోమంది ఆణిముత్యాలు లాంటి వారు మరిన్ని విజయాలు సాధిస్తారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్