సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి : సీపీఎం

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 01:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్లూరు: పుట్లూరు మండలంలోని కడవకుల గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి సూరి మాట్లాడుతూ, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఉండేలా ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలను, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించే విధంగా ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓట్లు విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తీసుకున్న ఏకపక్ష వైఖరులు కోట్లాదిమంది భారతీయ జీవితాలను ఓటు హక్కు లేని పౌరులుగా మార్చేస్తున్నాయి గత పది నెలలుగా 14 సార్లు తోటి కమిషనర్లు అభ్యంతరం చెబుతున్నప్పటికీ మోడీ అమిత్ షా మద్దతుతో అనేక అక్రమాలకు మోసాలకు పాల్పడిన ప్రధాన కమిషనర్ దేశం ముందు దోషిగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు వెంకట చౌదరి, భాస్కర్ రెడ్డి, టీ. పెద్దయ్య, కే.నాగభూషణం, ఆదినారాయణ, కుళ్లాయప్ప, జే. పెద్దయ్య తదితరులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్