సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టివికె ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాస్‌ హైకోర్టు

1 గంట క్రితం

Madras HC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 01:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : ఒక్క ఓటుతో గెలిచిన తిరుపత్తూరు టివికె ఎమ్మెల్యే ఆర్‌.శ్రీనివాస సేతుపతికి వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. తమిళనాడులో తిరుపత్తూరు పేరుతో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటంతో తాను ఎన్నికల్లో ఓడిపోయానని డిఎంకె అభ్యర్థి, మాజీ మంత్రి కె.ఆర్.పెరియకరుప్పన్‌ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ టివికె ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ జి.కె.ఇలంతిరైయన్‌ అనుమతించారు.

శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గానికి చెందిన ఒక పోస్టల్‌ ఓటు పొరపాటున తిరుపత్తూరు జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గానికి పంపారని, తప్పుగా బదలీ అయిన ఓటును సరైన నియోజకవర్గానికి తిరిగి పంపలేదని డిఎంకె అభ్యర్థి పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె అభ్యర్థి 83,374 ఓట్లు గెలుచుకోగా, టివికె అభ్యర్థి 83,375ఓట్లు సాధించడంతో ఇసి ఆయనను విజేతగా ప్రకటించింది.

పిటిషనర్‌ పేర్కొన్నట్లుగా కేవలం నియోజకవర్గాల పేర్లు ఒకేలా ఉండటం వల్ల ఒక నియోజకవర్గం పోస్టల్‌ ఓట్లు మరో నియోజకవర్గానికి వెళ్లిపోయే అవకాశం లేదని, ఎందుకంటే ఎన్నికల నిబంధనల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఏ నియోజకవర్గానికి చెందిందో నిర్ధారించేందుకు అనేక గుర్తింపు వివరాలు ఉంటాయని సీనియర్‌ న్యాయవాది వి. రాఘవాచారి, న్యాయవాదులు దీక్షిత గోహిల్‌, ప్రాంజల్‌ అగర్వాల్‌ సహాయంతో వాదనలు వినిపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్