- వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి గుల్లా ఏడుకొండలు.
ప్రజాశక్తి-గోకవరం : తంటికొండ–గోకవరం మధ్య ప్రధాన రహదారిపై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రహదారికి అడ్డంగా ఏర్పాటు చేయాల్సిన తూరలు కోసం సుమారు రెండేళ్ల క్రితమే నాలుగు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినప్పటికీ, ఇప్పటివరకు తూరలు ఏర్పాటు చేయకపోవడంపై వైస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గుల్లా ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో రహదారిపై ఉన్న గుంతల్లోని మట్టి కొట్టుకుపోయి పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని, దీంతో వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సిమెంట్ రహదారిపై ఉన్న గుంతల్లో మట్టి లేకపోవడంతో వాహనాలు సాఫీగా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.ఈ మార్గంలో ప్రతిరోజూ అనేకసార్లు ప్రయాణించే వాహనదారులు గుంతలను దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుచెబుతున్నారు. గతంలోనే ఈ సమస్యను పత్రికా ముఖంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆయన తెలిపారు. తూరలు ఏర్పాటుతో పాటు రహదారిపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చి, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రహదారిని సరిచేయాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)