ప్రజాశక్తి - వేపాడ : దళారులను నమ్మి మోసపోవద్దని డప్పు, చర్మ కళాకారులను వేపాడ మండలం ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ హెచ్చరించారు. గురువారం ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ స్థానిక విలేకరులతో మాట్లాడారు. గతములో ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే పెన్షన్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దీంతోగుర్తింపు కార్డుల కోసం దళారుల చేతిలో మోసపోవద్దని అన్నారు. ఈ ప్రభుత్వం డప్పు కళాకారుడు, చర్మకారుడు వారి సొంత డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని అన్నారు. దరఖాస్తు కోసం వారి ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం నఖలు జతపరిచి గ్రామ సచివాలయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలని అన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎంపీడీవో తెలిపారు.
దళారులను నమ్మి మోసపోవద్దు : ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 05:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)