బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేషనల్ కాన్వొకేషన్‌లో డాక్టర్ తరిగోపుల వివే‌క్‌‌కు గోల్డ్ మెడల్

22 జులై, 2026

award
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 05:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : ఒంగోలు బెతూన్ నర్సింగ్ హోమ్ ప్రముఖ యూరాలజీ వైద్యులు డాక్టర్ టి.పురుషోత్తమరావు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉదయినిల కుమారుడు డాక్టర్ తరిగోపుల వివేక్ ప్రతిభకు మరో అరుదైన గౌరవం దక్కింది. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో యూరో ఆంకాలజీ విభాగంలో సమర్పించిన పరిశోధనా పత్రానికి ఆయన గోల్డ్ మెడల్ అందుకున్నారు. డాక్టర్ తరిగోపుల వివేక్ గతంలో ఎయిమ్స్ భువనేశ్వర్‌లో ఎం.సి.హెచ్.యూరాలజీ పీజీ విద్యను పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన అంతర్జాతీయ యూరాలజీ సదస్సులో ప్రోస్టేట్ గ్రంథి వ్యాధులు, రోబోటిక్ సర్జరీ విభాగాల్లో తన పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఎయిమ్స్ భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్‌లో యూరో ఆంకాలజీ అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు గుర్తింపుగా శనివారం జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో కేంద్ర సహాయక వైద్య శాఖ మంత్రి అను ప్రియా పాటిల్ ఎయిమ్స్ భువనేశ్వర్‌కు చెందిన డాక్టర్లు, ప్రొఫెసర్ల నుంచి డాక్టర్ వివేక్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. డాక్టర్ వివేక్‌కు గోల్డ్ మెడల్ లభించడంపై బెతూన్ హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ టి.పురుషోత్తమరావు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉదయిని, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ సందీప్ ప్రకాష్, లాపరోస్కోపీ, సంతాన సాఫల్య వైద్య నిపుణులు డాక్టర్ టి.స్వాతి తదితరులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో సేవలందిస్తున్న వివేక్ త్వరలోనే ఒంగోలులో కూడా తన వైద్య సేవలను విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్