ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమాచార పౌర సంబంధాల శాఖ విజయవాడ కమిషనరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా ముమ్మడి వెంకటేశ్వర ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ మాట్లాడుతూ.. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ముమ్మడి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ... సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ మార్గనిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా చేరవేసేందుకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా సమర్థవంతమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఐ అండ్ పిఆర్ జాయింట్ డైరెక్టర్‌గా ముమ్మడి వెంకటేశ్వర ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 10:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)