mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA: డేవిడ్ హ్యాట్రిక్

1 గంట క్రితం

canada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 11:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఖ‌తార్‌పై కెన‌డా ఘన విజ‌యం

ఇస్మాయిల్‌‌కు తీవ్ర గాయం

వాన్‌కోవ‌ర్‌: ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఆతిథ్య దేశాల్లో ఒకటైన కెనడా జట్టు తొలిసారి జూలు విదిలించింది. గ్రూపు-బిలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో కెనడా 6-0తో ఖతార్‌‌ను చిత్తుగా ఓడించింది. దీంతో కెన‌డా ఖాతాలో నాలుగు పాయింట్లు జమ కావడంతో ఆ జట్టు నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కెన‌డా ప్లేయ‌ర్ జోనాథ‌న్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్ తో మెరిసాడు. బోస్నియాతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో కెనడా డ్రా చేసుకోవడంతోఈ మ్యాచ్‌‌ లో గెలుపు తప్పనిసరిగా మారింది. ఇక కెన‌డా ప్లేయ‌ర్ సైల్ లారిన్‌.. వాన్‌కోవ‌ర్‌ మ్యాచ్‌లో కూడా ఆ దేశానికి తొలి గోల్ అందించాడు. అత‌ను 16వ నిమిషంలో గోల్ చేశాడు. ఆ త‌ర్వాత డేవిడ్ చెల‌రేగిపోయాడు. 29, 45, 90 నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. కెన‌డా జ‌ట్టులో స‌లిబా, మ‌నాయి ఓజీ కూడా గోల్స్ చేశారు. దీంతో సొంత గడ్డ‌పై హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ప్లేయ‌ర్‌గా జోనాథ‌న్ డేవిడ్ నిలిచారు. గ‌తంలో 1966లో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ జెఫ్ హ‌స్ట్ స్వ‌దేశీ మైదానంలో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు.

ఇస్మాయిల్‌‌ కష్టమే..

కెన‌డా జ‌ట్టు భారీ విజ‌యం సాధించినా.. మిడ్‌ఫీల్డ‌ర్ ఇస్మాయిల్ కోన్ తీవ్రంగా గాయ‌ప‌డి ఆట మ‌ధ్య‌లోనే స్ట్రెచ‌ర్‌పై మైదానాన్ని వీడాడు. ఖ‌తార్ మిడ్ ఫీల్డ‌ర్ ఆసిమ్ మ‌డిబో త‌న కాలితో గ‌ట్టిగా తన్నడంతో కోన్ ఎడ‌మ‌కాలి ఎముక‌కు త్రీవ గాయమైంది. దీంతో ఇస్మాయిల్ నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో కనీసం మైదానాన్ని వీడడం కూడా కష్టం కావడంతో స్ట్రెచర్‌పై ఆక్సిజన్ మాస్క్‌తో బయటకు వెళ్లాల్సి వచ్చింది. పరీక్షించిన వైద్యులు అతని కాలి ఎముక‌ చిట్లినట్లు తేల్చారు. కోన్ ఇస్మాయిల్ కు కనీసం సుమారు నాలుగు నెల‌ల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో అతడు ఫిఫా టోర్నీకి దూరమయ్యాడు. ఇక ఖ‌తార్ ప్లేయ‌ర్ మ‌డిబోకు రెడ్ కార్డ్ ఇవ్వడంతో ఆ జట్టు 10మంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ ఘటన ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్