mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్లీన్‌‌స్వీప్‌‌పై టీమిండియా గురి

2 గంటల క్రితం

harshit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 11:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నేడు ఆఫ్ఘనిస్తాన్‌‌తో చివరి వన్డే

మ.1.30గం.లకు

చెన్నై: వన్డే సిరీస్‌‌ను చేజిక్కించుకున్న భారతజట్టు ఇక క్లీన్‌‌స్వీప్‌‌పై గురిపెట్టింది. ఎం. చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో భారత జట్టు అఫ్గాన్‌తో తలపడనుంది. ఇక మూడో వన్డే కోసం భారత యువ పేసర్‌ హర్షిత్‌ రాణా జట్టుతో చేరాడు. గాయం నుంచి కోలుకున్న అతడు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది. కాగా ధర్మశాల వేదికగా తొలి వన్డేలో అఫ్గాన్‌ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో వన్డేలోనూ టీమిండియా 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌‌ను కైవసం చేసుకుంది. తొలి వన్డేలో పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌, స్పిన్నర్‌ హర్ష్‌ దూబే అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరూ మూడేసి వికెట్లు కూల్చారు. అయితే, రెండో మ్యాచ్‌కు హర్ష్‌ దూబే దూరం కాగా.. కుల్దీప్‌ యాదవ్‌ ఆడాడు. అదే విధంగా నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ప్రసిద్‌ కృష్ణల స్థానంలో యశస్వి జైస్వాల్‌, ప్రిన్స్‌ యాదవ్‌ తుదిజట్టులోకి వచ్చారు. సిరీస్‌‌ను కైవసం చేసుకున్న టీమిండియా జట్టు ఇక చెన్నై వేదికగా జరిగే మూడో, నామమాత్రపు వన్డేలో ప్రయోగాలకు తెరలేపినా ఆశ్చర్యపోన్నక్కర్లేదు.


జట్లు (అంచనా)...

ఇండియా : గిల్‌(కెప్టెన్), జైస్వాల్‌, రోహిత్‌, ఇషాన్‌, శ్రేయస్‌, కెఎల్‌ ‌రాహుల్‌(‌వికెట్‌ ‌కీపర్‌), సుందర్‌, హర్షిత్‌ ‌రాణా, ఆర్ష్‌‌దీప్‌, కుల్దీప్‌, ప్రిన్స్‌.

ఆఫ్ఘనిస్తాన్‌: షాహిదీ(కెప్టెన్‌), గుర్బాజ్‌(వికెట్‌ ‌కీపర్‌), ఇబ్రహీమ్‌ జడ్రాన్‌, ‌సెద్ధిఖుల్లా, రామత్‌ ‌షా, రసోలీ, ఖరోటీ, రషీద్‌ ‌ఖాన్‌, ఘజన్‌‌ఫర్‌, సలీమ్‌ ‌రఫీ, బిలాల్‌ ‌సమీ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్