నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్-ఎపై గెలుపు
ముక్కోణపు వన్డే సిరీస్
దంబుల్లా: ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లోకి శ్రీలంక-ఎ జట్టు ప్రవేశించింది. దంబుల్లా వేదికగా శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక-ఎ జట్టు 103 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్-ఎను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక-ఎ జట్టులో అవిష్క ఫెర్నాండో(110) శతకానికి తోడు నిరోషన్ డిక్‌విల్లా అర్ధ శతకం (66)తో రాణించాడు. దీంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్ ఇబ్రహీం ఒక వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్, వన్‌డౌన్ బ్యాటర్ నూర్ ఉల్ రహ్మాన్ డకౌటయ్యారు. హసన్ ఎసాఖిల్ (74) ఒంటరి పోరాటానికి తోడు బహీర్ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదిత్ ఐదు వికెట్లతో రాణించగా.. కుగాతస్ మతూలన్ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో శ్రీలంక-ఎ జట్టు భారత్- ‘ఎ’తో తలపడనుంది.









కామెంట్‌లు (0)