స్కాట్లాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం
ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్
హెడింగ్లీ: లీడ్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై 7 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. స్టఫనీ టేలర్(47నాటౌట్)కి తోడు క్యాంప్‌బెలె(36) పరుగులతో రాణించగా.. స్కాట్లాండ్ బౌలర్లు ప్రేసర్‌కు రెండు, బ్రైస్, స్లాటర్, గోర్డెన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం వెస్టిండీస్ బౌలర్లు కట్టడిగా బౌల్ చేశారు. అలియానే(3/11), కెప్టెన్ మాథ్యూస్(3/19)కి తోడు ఫ్లేచర్‌కు రెండు, జోసెఫ్‌కు ఒక వికెట్ పడగొట్టి విండీస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఇక స్కాట్లాండ్ జట్టులో కర్టర్(59) అర్ధసెంచరీకి తోడు లిస్టెర్(33), ఫ్రేసర్(20) మాత్రమే రెండంక్కెల స్కోర్ చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టేలర్‌కు దక్కింది. దీంతో గ్రూప్-బిలో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో గెలుపుతో 4పాయింట్లతో 2వ స్థానంలో ఉంది.
ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు
ఆస్ట్రేలియా మహిళలు × నెదర్లాండ్స్ మహిళలు(మ.3.00గం.లకు)
పాకిస్తాన్ మహిళలు × బంగ్లాదేశ్ మహిళలు(రా.7.00గం.లకు)
ఇంగ్లండ్ మహిళలు × స్కాట్లాండ్ మహిళలు(రా.11.00గం.లకు)








కామెంట్‌లు (0)