బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత..

16 నిమిషాల క్రితం

cold
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 08:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. రానున్న మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12.5 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో అత్యల్పంగా 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కుబేర్‌లో 14.6 డిగ్రీలు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బషీరాబాద్, యాలాల్, మోమిన్‌పేటలో 14.7 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మంచాలలో 14.8 డిగ్రీలు నమోదయ్యాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో 15.1 డిగ్రీలు, హైదరాబాద్‌లోని దుండిగల్‌లో 15.9, బేగంపేటలో 16.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హకీంపేట, హయత్‌నగర్‌లో 18.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. రానున్న మూడు రోజులు చలి ప్రభావం కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా లేదని తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్