గౌహతి : అస్సాంలోని కామరూప్ (మెట్రో) జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దిగారు రైల్వే స్టేషన్‌లో కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. బుధవారం ఉదయం 6:54 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సిపిఆర్ఓ) కపింజల్ కిషోర్ శర్మ వెల్లడించారు. ఈ ఘటనపై ఏఎన్ఐతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకున్నారని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు, రైలు ప్రయాణికుల పరిస్థితి, రైల్వే సేవలపై ప్రభావానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అస్సాంలో పట్టాలు తప్పిన రైలు బోగీలు
31 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 08:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)