- 25 వరకు తుది జాబితా
- ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని భావించినప్పటికీ, తాజాగా ఆ పరిధిని విస్తరించి మొత్తం 100 స్థానాల్లో ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
నామినేషన్ల దాఖలుపై తలెత్తిన వివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.







కామెంట్‌లు (0)