- నేడు న్యూజిలాండ్‌తో తొలి టి20
- మ.12.30గం.ల నుంచి
క్రైస్ట్‌చర్చ్: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత టి20 జట్టు విదేశీగడ్డపై మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. బ్యాటర్లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై చెలరేగి ఆడే ఆటగాళ్లు.. పేస్, బౌన్స్‌లకు పెట్టింది పేరైన న్యూజిలాండ్ గడ్డపై గురువారం తొలి పరీక్షను ఎదుర్కోనున్నారు. ఐదు టి20లు, మరో ఐదు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ పర్యటనకు కివీస్ చేరిన భారత బృందం ఈ పర్యటనలో అంచనాలకు మించి రాణించాల్సిన పరిస్థితి. ఐర్లాండ్‌తోపాటు ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమిండియా వరుస సిరీస్ పరాజయాలు ఎదుర్కొంది. ఐర్లాండ్‌పై 0-2తో, ఇంగ్లాండ్ చేతిలోనూ 0-4తో టి20 సిరీస్‌లలో ఓటములు చవిచూసింది. అనంతరం స్వదేశంలో జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌పై విజయాలు సాధించినా.. ఆ జట్లతో పోలిస్తే న్యూజిలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన శ్రేయస్ సారథ్యానికి ఈ టూర్ కీలకంగా మారింది. స్వదేశంలో వెస్టిండీస్‌పై ఐదు టి20ల సిరీస్‌ను 2-2తో సమం చేసినా.. శ్రేయస్ తొలి టి20 మినహా.. మిగతా మ్యాచుల్లో నిరాశపరిచాడు. శ్రేయస్ టి20 సారథ్యంలో భారతజట్టు ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో 11 విజయాలను మాత్రమే నమోదు చేసుకుంది. ఇక దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన భువనేశ్వర్ కుమార్‌పై అందరి దృష్టి నెలకొంది. పేస్‌కు అనుకూలించే న్యూజిలాండ్ పిచ్‌లపై తన అనుభవంతో జట్టుకు అండగా నిలవాల్సిన బాధ్యత అతడిపై ఉంది. కీలకమైన టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో పేస్ విభాగాన్ని ముందుండి నడిపించే బాధ్యత భువీపై వుంది. న్యూజిలాండ్ పిచ్‌లపై బంతి స్వింగ్, బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే పిచ్ నుంచి సహకారం లభిస్తే.. వికెట్లు దక్కడం ఖాయం. ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ బరిలో దిగనున్నట్లు కెప్టెన్ శ్రేయస్ తెలిపాడు. న్యూజిలాండ్‌పై భారత్ చివరిసారిగా 2022లో టి20 సిరీస్ విజయం సాధించింది. అప్పట్లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో చేజిక్కించుకుంది. ఒక మ్యాచ్‌లో భారత్ గెలువగా.. మరో మ్యాచ్ టైగా అయ్యింది. మూడో టి20 వర్షంతో రద్దైంది.
జట్లు(అంచనా)...
ఇండియా: శ్రేయస్(కెప్టెన్), సంజు(వికెట్ కీపర్), ఇషాన్, తిలక్, దూబే, నితీశ్ కుమార్, అక్షర్, భువనేశ్వర్, ప్రిన్స్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, ఆర్ష్‌దీప్.
న్యూజిలాండ్: సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, టిమ్ షెఫర్ట్(వికెట్ కీపర్), కాన్వే, ఫిలిప్స్, మిఛెల్, బ్రాస్‌వెల్, స్మిత్, జేమీసన్, హెన్రీ, ఫెర్గూసన్.







కామెంట్‌లు (0)