ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఛలో ఢిల్లీ’కి బయలు దేరిన కార్మికులకు విడ్కోలు పలికిన ప్రజా సంఘాల నేతలు

1 గంట క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 09:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు డిసెంబరు 1 నుంచి 3వ తేదీ వరకూ ఢిల్లీలో ఇచ్చిన పోరాట పిలుపులో పాల్గొనేందుకు రాష్ట్రం నుండి బయలుదేరిన కార్మికులకు.. రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అభినందనలు తెలియజేస్తూ, వీడ్కోలు పలికారు. విజయవాడ నుంచి వివిధ రైళ్లలో ఢిల్లీకి ఆదివారం బయలుదేరిన కార్మికులను నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే లోకనాథం, కౌలు రైతులు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, కెవిపిఎస్ నాయకులు ఆండ్ర మాల్యాద్రి, సిఐటియు నాయకులు పి . అజయకుమార్, ఎన్సిహెచ్ శ్రీనివాస్, ఏ కమల తదితరులు మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాల ప్రతిఘటన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగే ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనేక రాయితీలు ఇచ్చిందని, ప్రజానీకాన్ని అప్పుల పాలసీ అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు సర్ పేరుతో ఓట్లను తొలగించడమే కాకుండా డిలిమిటేషన్ బిల్లును తెచ్చి అక్రమ పద్ధతుల్లో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాజ్యాంగాన్ని నాశనం చర్యలకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు వి.వెంకటేశ్వర్లు వి.రాణి, వృత్తి దారుల సంఘం నాయకులు పి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్