ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి..

1 గంట క్రితం

utf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- యుటిఎఫ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహిస్తోన్న ఉపాధ్యాయులను బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి అప్పగించిన బాధ్యతలను నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల విధుల సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు, అనుచిత ప్రవర్తనను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తోన్న ఉపాధ్యాయుడును బెదిరించిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనదని, దాని నిర్వహణలో పాల్గొనే ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడాలని కోరారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి భద్రత కల్పించడంతోపాటు, విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల విధుల విషయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్