శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అల్పపీడనం - వాయుగుండంగా మారే అవకాశం !

19 నిమిషాల క్రితం

Low pressure area likely to intensify into a depression
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 01:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే సముద్రంలో గాలుల వేగం పెరిగే సూచనలు ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోందని వెల్లడించారు. దీని కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.


ఆదివారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ...

ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం శనివారం అదే ప్రాంతంలో సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అనంతరం ఇది మరింత బలపడి ఆదివారం నాటికి వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ అల్పపీడనం తదుపరి ఎటువైపు ప్రయాణిస్తుంది.. దాని ప్రభావం ఏయే ప్రాంతాలపై ఉంటుంది.. అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను బట్టి దీనిపై మరింత సమాచారం అందే అవకాశం ఉంది.


గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ...

అల్పపీడనం ప్రభావంతో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించారు.


మత్స్యకారులకు హెచ్చరిక ...

సముద్రంలో గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు మాత్రమే ఉన్నాయని, దాని ప్రయాణం, ప్రభావంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి దీనిపై వచ్చే అధికారిక వాతావరణ బులెటిన్లను గమనించాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్