శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IND vs NZ : తొలి ఓవర్‌లోనే భారత్‌కు కోలుకోలేని దెబ్బ

14 నిమిషాల క్రితం

IND vs NZ A devastating blow for India in the very first over
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 12:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెత్త రికార్డు నమోదు


మౌంట్ మౌంగనుయి (న్యూజిలాండ్) : న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 334 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్‌లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను పెవిలియన్‌కు పంపి భారత్‌ను దెబ్బతీశారు.


ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ శర్మ (0) వికెట్‌ను భారత్ కోల్పోయింది. హెన్రీ వేసిన బంతి అదనపు బౌన్స్‌తో బ్యాట్ అంచును తాకగా, స్లిప్‌లో ఫిల్ అలెన్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నారు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ నాలుగు బంతులు ఎదుర్కొన్నప్పటికీ పరుగుల ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యారు. ఓవర్ చివరి బంతికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. దీంతో ఒక్క పరుగు కూడా చేయకుండానే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్, శ్రేయస్ గోల్డెన్ డకౌట్ కాగా, కోహ్లీ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయిన తొలి భారత జట్టుగా టీమిండియా చెత్త రికార్డును నమోదు చేసింది. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ అద్భుత ప్రదర్శనతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చగా, భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆరంభంలోనే తీవ్ర ఇబ్బందుల్లో పడింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్