మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైదుకూరు మున్సిపల్‌ ఎన్నిక వాయిదా...

10 గంటల క్రితం

modukuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 09:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో ​: కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో కొన్ని వార్డులకు సంబంధించిన నామినేషన్ పత్రాలు చినిగిపోయినట్లు కలెక్టర్ నివేదిక సమర్పించారని చెప్పారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించి మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను నిలిపివేశామన్నారు. ఇతర జిల్లాల్లో పరిణామాలపైనా నివేదికలు పరిశీలిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్