సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

32 నిమిషాల క్రితం

ips.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 07:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బదిలీలకు సంబంధించి అధికారులు, వారి కొత్త పోస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.

సీహెచ్‌. త్రివిక్రమ వర్మ – ఎస్పీఎఫ్‌ డీజీ నుంచి డైరెక్టర్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌గా బదిలీ.

జయలక్ష్మి – ఏసీబీ డైరెక్టర్‌ నుంచి సీఐడీ సైబర్‌ క్రైమ్స్‌ ఐజీగా నియామకం.

బి. రాజకుమారి – ఏపీఎస్పీ బెటాలియన్స్‌ ఐజీ నుంచి రైల్వే ఐజీగా బదిలీ. సీఐడీ ఉమెన్‌ సేఫ్టీ ఐజీగా అదనపు బాధ్యతలు.

కాంతి రాణా టాటా – ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌ సేఫ్టీ ఐజీగా నియామకం.

విశాల్‌ గున్ని – ట్రైనింగ్‌ డీఐజీగా పోస్టింగ్‌.

బాబూజీ అట్టాడ – గ్రేహౌండ్స్‌ డీఐజీ నుంచి టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీగా బదిలీ.

పంకజ్‌ కుమార్‌ మీనా – పోలవరం ఓఎస్డీ నుంచి మార్కాపురం జిల్లా ఎస్పీగా నియామకం.

జగదీశ్‌ అదహళ్లి – సీఎంఎస్‌జీ ఎస్పీ నుంచి పల్నాడు జిల్లా ఎస్పీగా బదిలీ.

కే. చక్రవర్తి – సీఐడీ ఎస్పీ నుంచి పోలవరం జిల్లా ఎస్పీగా నియామకం. ఈ బదిలీలతో పలు కీలక శాఖలు, జిల్లాలకు కొత్త అధికారులను ప్రభుత్వం నియమించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్