సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకారులో ఊపిరాడక చిన్నారి మృతి

50 నిమిషాల క్రితం

చిన్నారి మృతి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 07:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డోర్లు లాక్‌ అవ్వడంతో విషాదం

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కారులోకి వెళ్లి, డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతిచెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ పెద్ద కుమార్తె తన్వితా శ్రీ (4) ఇంటి ముందు ఆడుకుంటూ అక్కడే పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లింది. ప్రమాదవశాత్తు కారు లోపలే చిక్కుకుపోయింది. కొంతసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా రెండు గంటల తరువాత కారులో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే చిన్నారిని కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి అకాల మరణంతో నవీన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్