మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనుచిత వ్యాఖ్యలు వద్దు : టిడిపి, వైసిపి కీలక ఆదేశాలు

21 నిమిషాల క్రితం

No inappropriate remarks Key directives from TDP and YCP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 03:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : జనసేన అధినేత, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ... టిడిపి, వైసిపి స్పందించాయి. ఈ సున్నితమైన అంశంపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని టిడిపి అనుబంధ విభాగం ఐటిడిపి తన సోషల్ మీడియా కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసింది. కూటమి, వైసిపి నేతల వ్యక్తిగత జీవితాలపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు ... పవన్ వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయవద్దని తమ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగాలకు వైసిపి కూడా సూచించినట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. సంబంధిత వ్యక్తుల గోప్యతను గౌరవించాలని, బహిరంగ వేదికలపై సంయమనం పాటించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
011


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్