మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సింగపూర్‌లో 500 టన్నుల సామర్థ్యంతో గోల్డ్ వాల్ట్

39 నిమిషాల క్రితం

Gold vault with a 500-tonne capacity in Singapore
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 03:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆసియా గోల్డ్ ట్రేడింగ్ హబ్‌గా ఎదిగేందుకు సింగపూర్ చర్యలు


సింగపూర్ : అంతర్జాతీయ బంగారం నిల్వలు, వ్యాపారానికి కేంద్రంగా ఎదిగే లక్ష్యంతో సింగపూర్ 500 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక గోల్డ్ వాల్ట్‌ను ప్రారంభించింది. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు తమ బంగారు నిల్వలను భద్రపరుచుకునేందుకు ఈ వసతిని అందుబాటులోకి తెచ్చింది.


బంగారం నిల్వ, శుద్ధి, రీ-మెల్టింగ్, నాణ్యత పరీక్ష, బ్రోకింగ్ వంటి టోకు సేవలకు పన్ను మినహాయింపులు ప్రకటించింది. అంతర్జాతీయ బులియన్ వ్యాపారాన్ని ఆకర్షించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.


ఆసియాలో గోల్డ్ ట్రేడింగ్ కేంద్రంగా ఎదిగేందుకు హాంకాంగ్‌తో పోటీ పడుతున్న సింగపూర్, 2027లో భౌతిక డెలివరీ సదుపాయంతో కూడిన కిలో బంగారం ఫ్యూచర్స్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. అలాగే గోల్డ్ క్లియరింగ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తోంది.


ఈ చర్యలతో అంతర్జాతీయ బంగారం వ్యాపారం సింగపూర్‌కు మరింతగా విస్తరించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్