- జీఏడీ టవర్స్, హెచ్‌ఓడీ టవర్స్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు
ప్రజాశక్తి - తుళ్లూరు (అమరావతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:00 గంటల మధ్య అమరావతిలోని రాయపూడి గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్స్, హెచ్‌ఓడీ టవర్స్‌ను సందర్శించి, జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ప్రణాళిక, పార్కింగ్, రాకపోకల నియంత్రణ తదితర అంశాలను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, సి ఆర్ డి ఎ కమీషనర్ విజయ రామరాజు,ఎస్ పి వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, విధుల్లో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ పి (ఎల్‌అండ్‌ఓ) ఎ టీ వి రవికుమార్,సి ఆర్ డి ఎ అదనపు కమిషనర్ రాహుల్ కుమార్ రెడ్డి,గుంటూరు ఆర్ డి ఓ శ్రీనివాసరావు, ఎస్ బి డి ఎస్ పి అలహరి శ్రీనివాస్, తుళ్లూరు ఎస్ డి పి ఓ మురళీకృష్ణ, ఎస్‌ఎస్‌జీ డి ఎస్ పి రఘుబాబు, తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)