గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐఐఎఫ్ఎస్ఈ గ్రూప్ డైరెక్టర్‌ శ్రీను మహంతికి ఏషియా ప్రైడ్ అవార్డ్

1 గంట క్రితం

vzm-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 04:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- విజయనగరం టౌన్ : ఐఐఎఫ్ఎస్ఈ గ్రూప్ డైరెక్టర్ శ్రీను మహంతికి ఇండస్ట్రియల్ ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ, నైపుణ్యాభివృద్ధి, భద్రతా అవగాహన రంగాల్లో చేసిన కృషికి ప్రతిష్టాత్మకమైన ఏషియా ప్రైడ్ అవార్డ్ 2026 లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును రాజస్థాన్ గవర్నర్ హరిభావు కిసన్‌రావు బాగ్డే చేతుల మీదుగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ప్రదానం చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఫైర్ & సేఫ్టీపై అవగాహన పెంపొందించడం, సురక్షితమైన పారిశ్రామిక వాతావరణం కోసం కృషి చేస్తున్న గ్రూప్ సేవలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందని గ్రూప్‌ డైరెక్టర్‌ శ్రీను మహంతి వివరించారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును అందించిన ఆసియా ప్రైడ్ అవార్డ్స్ 2026 నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని ఐఐఎఫ్ఎస్ఈ గ్రూప్ మొత్తానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్