గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటర్ల జాబితా పరిశీలన

20 ఆగస్టు, 2026

annamayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కలకడ : ఓటర్ల జాబితాను పరిశీలించినట్లు డిప్యూటీ ఎంపీడీవో చక్రపాణి పేర్కొన్నారు. గురువారం మండలములోని బాలయ్యగారిపల్లి పంచాయతీ ఎర్రయ్యగారిపల్లిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన ఓటర్ల జాబితా ను పరిశీలించినట్లు తెలిపారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఉన్న ఓటర్లను పరిశీలించి వాటిని సరి చేస్తామని అన్నారు. ఈ ఓటర్ల జాబితాలో మృతి చెందిన వారి ఓటర్లు, డబల్ ఎంట్రీ ఉన్న ఓటర్లను, ఊరు వదిలి వెళ్ళిన వారి ఓటర్లను గుర్తిస్తామని అన్నారు. ఈ ఓటర్ల జాబితా పరిశీలనలో అన్ని పార్టీల నేతలు పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విశ్వనాథ నాయుడు, మాజీ ఎంపీటీసీ ఈశ్వరయ్య, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎర్రయ్య గారి వెంకటరమణ, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ కమలాకర్ రెడ్డి, పంచాయతీ డెవలప్మెంట్ అధికారి దేవేంద్ర, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్