ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసియా క్రీడల పోరులో సినీనటుడు మాధవన్‌ కుమారుడు

59 నిమిషాల క్రితం

Film actor Madhavan's son in the Asian Games fray
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 04:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు ఆర్.మాధవన్‌ కుమారుడు వేదాంత్‌ మాధవన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం 2026లో జరగనున్న 20వ ఏషియన్‌ గేమ్స్‌కు ఆయన సన్నద్ధమవుతున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో పోటీకి సిద్ధమవుతున్న తన కుమారుడి ఫొటోను మాధవన్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.


ఫ్రీస్టైల్‌ స్విమ్మర్‌గా వేదాంత్‌ ఇప్పటికే పలు అంతర్జాతీయ విజయాలను నమోదు చేశారు. మలేషియన్‌ ఓపెన్‌లో ఐదు స్వర్ణ పతకాలు, డానిష్‌ ఓపెన్‌లో ఒక స్వర్ణం, ఒక రజత పతకం సాధించారు. అలాగే లాత్వియన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌ తరఫున స్విమ్మింగ్‌లో రాణిస్తున్న యువ క్రీడాకారుల్లో వేదాంత్‌ ఒకరని ఒలింపిక్స్‌ అధికారిక వెబ్ ‌సైట్‌ పేర్కొంది. ఒక స్టార్ హీరో కొడుకుగా కాకుండా, స్విమ్మర్‌గా సొంత గుర్తింపు సాధించడమే తన లక్ష్యమని వేదాంత్‌ గతంలో వెల్లడించారు. తోటి క్రీడాకారులు తనను ప్రత్యేక గుర్తింపుతో కాకుండా, ఒక క్రీడాకారుడిగా గౌరవించే స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కుమారుడి క్రీడా ప్రయాణం, విజయాల పట్ల మాధవన్‌ కూడా ఎంతో గర్వంగా ఉన్నారు. తన సినీ కెరీర్‌ కంటే కుమారుడు ఎంచుకున్న స్విమ్మింగ్‌ రంగమే తనకు అత్యంత ముఖ్యమని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్