ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కారు డోర్ లాకయ్యి.. ఊపిరాడక చిన్నారి మృతి

1 గంట క్రితం

Toddler dies of suffocation after getting locked in car.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జూలూరుపాడు : కారు డోర్ లాకయ్యి ఊపిరాడక చిన్నారి మృతి చెందిన దుర్ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్‌లో ఆదివారం జరిగింది. వినోబానగర్ సర్పంచి గంగావత్ నవీన్‌కు ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద కుమార్తె తన్విశ్రీ (4) ఇంటి వద్ద ఆడుకుంటూ కారు ఎక్కి డోర్ వేయడంతో లాక్ పడింది. చిన్నారి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెంది సమీపంలో గాలించారు. దాదాపు 2 గంటల తర్వాత కారులో చూడగా, ముందు భాగంలోనే రెండు సీట్ల మధ్యలో చిన్నారి పడిపోయి ఉంది. వెంటనే కారు అద్దాలను పగలగొట్టి బాలికను బయటకు తీశారు. చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావించి చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఉదయం ముద్దు ముద్దు మాటలతో తల్లిదండ్రులను మురిపించిన చిన్నారిని విగత జీవిగా చూడాల్సి రావడంతో కుటుంబీకులంతా శోకసంద్రంలో మునిగారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్