ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు అక్కడక్కడా పొగమంచు

19 నిమిషాల క్రితం

weather
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 30, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- భారత వాతావరణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: నైరుతి బంగాళాఖాతం నుంచి ఛత్తీస్‌గఢ్‌ వరకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఆంధ్ర తీరానికి దూరంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాం, రాయలసీమలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్